News November 10, 2024
దారుణం: ఇరాక్‌లో 9 ఏళ్ల బాలికలను పెళ్లి చేసుకునేలా చట్టం!

పర్సనల్ లా చట్టాన్ని సవరించేందుకు ఇరాక్ పార్లమెంటు సిద్ధమవ్వడంపై హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. సవరణకు ఆమోదం లభిస్తే అమ్మాయిల పెళ్లి వయసు 9ఏళ్లకు తగ్గిపోతుంది. విడాకులు, పిల్లల కస్టడీ, వారసత్వ ఆస్తిపై మహిళలు హక్కులు కోల్పోతారు. ఇది చైల్డ్ సెక్స్‌ను చట్టబద్ధం చేయడమేనని, స్త్రీల పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుందని దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా షియా ప్రభుత్వం తగ్గేలా లేదు.
Similar News
News December 3, 2025
KNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

డిసెంబర్ 14న జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలలో పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్: ఖర్గేకు సీఎం రేవంత్ ఆహ్వానం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానాలు అందజేస్తున్నారు. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన కాసేపటి క్రితమే AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. సమ్మిట్ ఇన్విటేషన్‌ను అందజేశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా వారు ఖర్గేతో చర్చించారు.
News December 3, 2025
‘ది రాజా సాబ్’ రన్ టైమ్ 3గంటలు ఉండనుందా?

రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ మారుతీ కాంబోలో వస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ రన్ టైమ్‌పై SMలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మూవీకి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడి టికెట్ బుకింగ్ యాప్స్‌లో రన్ టైమ్ 3.15 గంటలు ఉన్నట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. భారత్‌లోనూ దాదాపుగా ఇదే రన్ టైమ్ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది.


