News January 28, 2025
రాష్ట్రంలో దారుణం

TG: హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌లో దారుణం జరిగింది. భరత్ అనే యువకుడిపై ఓ యువతి(17) తండ్రి దాడి చేసి గొంతు కోశాడు. యువకుడు ఆ యువతితో కలిసి ఇంట్లో ఉండగా చూసిన ఆమె తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. దీన్ని అవమానంగా భావించిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో యువతిని కలిసేందుకు భరత్ వెళ్లినట్లు సమాచారం.
Similar News
News November 17, 2025
TODAY HEADLINES

✦ రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని అయ్యారు: CM CBN
✦ TGకి నాలుగో అద్భుతంగా RFC: CM రేవంత్
✦ రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో CBN, రేవంత్ సరదా ముచ్చట్లు
✦ TGలో రేషన్ కార్డు ఉంటేనే ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
✦ కూటమి ప్రభుత్వంలో భారీగా పెరిగిన అప్పులు: YS జగన్
✦ ఎర్రకోట ఆత్మాహుతి దాడి.. కీలక నిందితుడు అరెస్ట్
✦ తొలి టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం
News November 17, 2025
దక్షిణ చైనా సముద్రంలో బాంబర్ పెట్రోలింగ్

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇటీవల US, జపాన్‌లతో కలిసి ఫిలిప్పీన్స్ అక్కడ నౌకాదళ విన్యాసాలు చేపట్టింది. దీనికి కౌంటర్‌గా చైనా తొలిసారిగా యుద్ధ విమానాలతో బాంబర్ ఫార్మేషన్ పెట్రోలింగ్ నిర్వహించింది. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఫిలిప్పీన్స్‌ను హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రమంతా తమదేనని డ్రాగన్ వాదిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకే ఫిలిప్పీన్స్ విన్యాసాలు చేపట్టింది.
News November 17, 2025
నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’ ఇదే

విశ్వంలో శని గ్రహానికి అందమైన గ్రహంగా పేరుంది. దాని చుట్టూ ఉండే అందమైన వలయాలే దీనికి కారణం. ఆ వలయాలకు సంబంధించిన ఫొటోను నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’గా తన సైట్లో పేర్కొంది. కాసిని స్పేస్ క్రాఫ్ట్ 2004-2017 మధ్య సాటర్న్ చుట్టూ తిరుగుతూ రింగ్స్‌ను చిత్రీకరించింది. ఆ ఇమేజ్‌ల నుంచి పై ఫొటోను డిజిటల్‌గా క్రాప్ చేశారు. బ్లూ కలర్లో కనిపించేది రింగ్ ప్లేన్. డార్క్ షాడోస్‌లో ఉన్నవి వలయాల నీడలు.


