News February 14, 2025

ప్రేమికుల దినోత్సవం నాడు దారుణం

image

AP: ప్రేమికుల దినోత్సవం నాడు అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. గుర్రంకొండ మం. ప్యారంపల్లికి చెందిన ఓ యువతికి (23)కి ఏప్రిల్ 29న శ్రీకాంత్ అనే వ్యక్తితో పెళ్లి కావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ఆమెను ప్రేమించిన గణేశ్ సైకోలా మారాడు. ఇక ఆమె తనకు దక్కదని భావించి యువతి తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Similar News

News January 26, 2026

భీష్మాష్టమి పూజా విధానం

image

ఈ పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. శాంతికి చిహ్నమైన తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించాలి. విష్ణుమూర్తిని తామర పూలు, తులసి దళాలతో అర్చించాలి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఉపవాసం ఉండాలి. జాగరణ చేయాలి. తామర వత్తులతో దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణంతో ఇంటికి శుభం కలుగుతుంది. పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం అందించడం ఎంతో శ్రేష్ఠం.

News January 26, 2026

మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

image

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.

News January 26, 2026

HAM రోడ్ల పనులకు ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ!

image

TG: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(HAM)లో అభివృద్ధి చేయడానికి గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం ఉంటుందని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో వారికి అడ్వాన్స్‌ కింద 10%, వర్క్ ముగియగానే 30% బిల్లులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. మిగతా 60% పదిహేనేళ్లలో చెల్లించేలా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనుంది. తద్వారా పనులు స్పీడప్ అవుతాయని భావిస్తోంది.