News May 14, 2024
మంత్రి బుగ్గనపై అట్రాసిటీ కేసు
AP: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై బేతంచెర్ల పోలీస్ స్టేషన్‌లో SC, ST అట్రాసిటీ కేసు నమోదైంది. తనను బుగ్గన కులం పేరుతో దూషించారని డోన్ ఇండిపెండెంట్ అభ్యర్థి పీఎన్ బాబు ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరులు తన కారుపై దాడి చేశారని పేర్కొన్నారు. దీంతో బుగ్గనతోపాటు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 10, 2025
BGTలో రికార్డులే రికార్డులు!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన BGTలో గ్రౌండ్‌లోనే కాకుండా బయట కూడా పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ సిరీస్ FOX స్పోర్ట్స్‌లో 1.4బిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవడంతో పాటు 7కు పైగా ఛానళ్లలో 13.4M నేషనల్ ఆడియన్స్‌ను చేరుకుందని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు తెలిపాయి. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో 2బిలియన్ వీడియో వ్యూస్ వచ్చినట్లు వెల్లడించాయి. ఈ సిరీస్‌లో IND 1-3తో ఓడిపోయిన విషయం తెలిసిందే.
News January 10, 2025
లేఔట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం GOలు తెచ్చింది. లేఔట్లలో రోడ్లను 12M బదులు 9Mలకు కుదిస్తూ, 500చ.మీ. పైబడిన స్థలాల్లోని నిర్మాణాల్లో సెల్లార్‌కు అనుమతి, TDR బాండ్ల జారీ కమిటీలో సబ్ రిజిస్ట్రార్లను తొలగిస్తూ నిర్ణయించింది. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా జీవోలు తెచ్చామని.. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు.
News January 10, 2025
కాంగ్రెస్, BRS మధ్య ‘బ్లాక్ బ్యాగ్’ విమర్శలు!
TG: ‘పదేళ్ల నుంచి దుమ్ము పట్టిన ఒక నల్ల బ్యాగు ACB ఆఫీసులో ఉంది. ఈ బ్యాగ్ ఎవరిదో చెప్పుకోండి’ అంటూ BRS ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన T కాంగ్రెస్ ‘ఆ నల్ల బ్యాగులో 2014 నుంచి మీరు చేసిన పాపాల చిట్టా ఉంది. ఆ బ్యాగును చూసి తెల్లమొహం వేసుకున్నాడా KTR? BRS దోపిడీ దొంగల అవినీతి వివరాలను నింపడానికి ఆ బ్యాగు సరిపోదు. KTR విచారణకు వెళ్లిన ప్రతిసారి బ్యాగులను లెక్కించమని చెప్పండి’ అని కౌంటర్ ఇచ్చింది.