News March 18, 2025

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు

image

TG: BRS నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

Similar News

News December 12, 2025

IIRSలో 11 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్‌(IIRS)లో 11 JRF పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎంఎస్సీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు NET,GATE అర్హత సాధించి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iirs.gov.in/

News December 12, 2025

శనగలో ఎండు, వేరుకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

image

ప్రస్తుతం రబీ శనగ పంట కొన్ని ప్రాంతాల్లో శాఖీయ దశలో ఉంది. ఈ సమయంలో భూమి నుంచి వచ్చే తెగుళ్ల ముప్పు ఎక్కువ. ముఖ్యంగా ఎండు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశించి మొక్కలు పసుపు రంగులోకి మారి అక్కడక్కడ గుంపులు గుంపులుగా చనిపోతాయి. దీని నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ప్రొపినెబ్ 400 గ్రా. లేదా కుప్రోఫిక్స్ 400 గ్రా. లేదా టెబుకోనజోల్ 200mlలలో ఏదో ఒక మందును కలిపి మొక్కల వేర్లు బాగా తడిచేలా పిచికారీ చేయాలి.

News December 12, 2025

కోల్డ్ వాటర్ థెరపీతో ఎన్నో లాభాలు

image

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్, ఫైటింగ్ కెమికల్స్ విడుదలవుతాయి. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల డోపమైన్ పరిమాణం పెరుగుతుంది. ఇది ‘ఫీల్ గుడ్’ హార్మోన్. ఇది తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.