News February 9, 2025
దారుణం: ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737718673775_1032-normal-WIFI.webp)
AP: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలంలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫొటోలు తీసి మరో ఇద్దరు స్నేహితులకు పంపించాడు. వారు ఆ ఫొటోలతో బాధితురాలిని బెదిరించారు. దీంతో వేధింపులు తాళలేక పేరెంట్స్తో కలిసి బాధితురాలు కంచికచర్ల పీఎస్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 10, 2025
నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739146745065_893-normal-WIFI.webp)
AP: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేడు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆల్బెండజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 1-19 ఏళ్లలోపు వయసున్న వారికి వీటిని వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ స్కూలుకు హాజరు కాని వారికి 17వ తేదీన అందించనున్నట్లు సమాచారం.
News February 10, 2025
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739144708443_893-normal-WIFI.webp)
తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35-37 డిగ్రీల మధ్య నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 37.7 డిగ్రీలు రికార్డు అయింది. అటు ఏపీలోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కర్నూలులో 36.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News February 10, 2025
బ్యాటింగ్ ఎంజాయ్ చేశా.. సెంచరీపై రోహిత్ కామెంట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739142953162_653-normal-WIFI.webp)
ఇంగ్లండ్తో రెండో వన్డేలో సెంచరీ చేసి జట్టు కోసం నిలబడటం సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన బ్యాటింగ్ ఎంజాయ్ చేశానని చెప్పారు. బ్యాటింగ్కు దిగినప్పుడే వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన బాడీని లక్ష్యంగా చేసుకొని వేసిన బంతులపై సరైన ప్రణాళికలు అమలు చేశానని పేర్కొన్నారు. ఇక గిల్ చాలా క్లాసీ ప్లేయర్ అని రోహిత్ కితాబిచ్చారు.