News August 1, 2024
నిమ్స్‌లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్

TG: ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ సొంతూరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. శస్త్ర చికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులపై అతడి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.
Similar News
News March 12, 2026
మునగలో కాయతొలుచు ఈగ నివారణకు సూచనలు

మునగ పంటలో విత్తనాలు నాటిన 5 నెలలకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటకు కాయ తొలుచు ఈగ ముప్పు ఎక్కువ. ఇది పంటను ఆశించి పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫానలోన్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 12, 2026
యుద్ధం.. అమెరికాకు 6 రోజులకే రూ.లక్ష కోట్లు

ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న అమెరికాకు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. తొలి 6 రోజులకే $11.3Bn(₹1.04L Cr) వ్యయమైనట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. క్లోజ్డ్ డోర్‌లో జరిగిన భేటీలో US శాసనసభ్యులకు పెంటగాన్ ప్రతినిధులు ఈ విషయాన్ని తెలిపారని పేర్కొంది. ఆపరేషన్ ప్లానింగ్, సైనికులు, ఆయుధాల తరలింపు సహా అనేక ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ఖర్చు మరింత పెరుగుతుందని తెలిపింది.
News March 12, 2026
మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


