News August 24, 2025

రాష్ట్రంలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

image

TG: భద్రాద్రి(D)లో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన బాలిక(17) ఈనెల 22న రాత్రి ములుగు(D) వాజేడు వెళ్లేందుకు చర్లలో ఆటో ఎక్కింది. ఒంటరిగా ఉన్న ఆమెకు ముగ్గురు ఆటో డ్రైవర్లు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం పాల్వంచలో వదిలేశారు. పోలీసులు బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News August 24, 2025

త్వరలో RSS కీలక మీటింగ్.. వీటిపైనే చర్చ!

image

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) వార్షిక సమావేశం SEP 5-7 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరగనుంది. RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్‌కు BJP సహా ABVP, భారతీయ మజ్దూర్, కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసీ కళ్యాణ్, సేవా సమితి తదితర అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. BJP తదుపరి చీఫ్ ఎన్నికతో పాటు US టారిఫ్స్ ఇతర సమకాలీన కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

News August 24, 2025

GATE-2026 షెడ్యూల్‌లో మార్పు

image

M.Tech, PhD కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2026) షెడ్యూల్‌ మారింది. రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ అయింది. ఈనెల 28నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారిక <>సైట్‌లో<<>> పేర్కొంది. SEP 28న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలస్య రుసుంతో OCT 9 వరకు అప్లై చేసుకోవచ్చు. 2026 FEB 7,8,14,15 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

News August 24, 2025

103 శాటిలైట్స్, చంద్రయాన్-8.. ఇస్రో ప్లాన్ ఇదే!

image

ఇస్రో ఫ్యూచర్ ప్లాన్‌పై స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ కీలక విషయాలు వెల్లడించారు. ‘2025-2040 వరకు భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ 15 ఏళ్లలో సెక్యూరిటీ, సర్వైలెన్స్, ఎర్త్ అబ్జర్వేషన్, ల్యాండ్, ఓషన్ అప్లికేషన్స్ తదితర 103 శాటిలైట్స్ లాంచ్ చేయనున్నాం. చంద్రయాన్-4,5,6,7,8 మిషన్స్ ప్లాన్ చేస్తున్నాం. బెస్ట్ స్పేస్ ఫెయిరింగ్ నేషన్‌గా భారత్ ఎదుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.