News April 7, 2024
ఘోరం: 29 గంటలపాటు ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

కేరళలోని వయనాడ్ వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్(20) FEB 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ‘FEB 16న ఉ.9 నుంచి మరుసటి రోజు మ.2 వరకు 29 గంటలపాటు సిద్ధార్థన్‌పై సీనియర్లు క్రూరంగా దాడి చేశారు. బెల్టులతో కొడుతూ ర్యాగింగ్ చేశారు. దీంతో మానసిక ఒత్తిడికి గురై అతను బాత్‌రూమ్‌లో ఉరివేసుకున్నాడు’ అని పోలీసులు నివేదించారు. కాగా ఈ కేసును CM విజయన్ CBIకి అప్పగించారు.
Similar News
News January 15, 2026
కోల్ ఇండియా లిమిటెడ్‌లో 125 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కోల్ ఇండియా లిమిటెడ్‌లో 125 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎగ్జామ్ లేదు. కేవలం విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.22వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.coalindia.in/
News January 15, 2026
క్యారెట్ సాగు – కీలక సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని జనవరి వరకు నాటుకోవచ్చు. ఈ పంటలో నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.
News January 15, 2026
‘కనుమ రోజు ఈ పని చేయడం మర్వకండి’: పండితులు

భోగి నాడు చిన్నారులపై భోగి పళ్లు పోసి దిష్టి తీసినట్లుగానే, కనుమైన నేడు పాడి పశువులకు దిష్టి తీయాలని పండితులు సూచిస్తున్నారు. వాటిపై చెడు ప్రభావం పడకూడదన్నా, ఆయుష్షు పెరగాలన్నా రైతన్నలు ఈ ఆచారం పాటించాలంటున్నారు. ‘పసుపు, కుంకుమలు కలిపిన నీటితో, హారతితో పశువులకు దిష్టి తీయాలి. అవి లక్ష్మీ స్వరూపంతో సమానం. ఇలా చేస్తే పశుసంపద సంక్షేమంగా ఉండి, రైతు ఇల్లు పాడి పంటలతో కళకళలాడుతుంది’ అని చెబుతున్నారు.


