News April 24, 2024

జగన్‌పై దాడి కేసు.. కోర్టులో పోలీసుల పిటిషన్

image

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు సతీశ్ నుంచి వాంగ్మూలం తీసుకోవాలని న్యాయస్థానాన్ని పోలీసులు కోరగా.. 164 సీఆర్పీసీ ప్రకారం వాంగ్మూలం అక్కర్లేదని నిందితుడి న్యాయవాది కోర్టుకు వివరించారు. విచారించిన కోర్టు.. ఈ నెల 29లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

Similar News

News March 27, 2026

తిరుపతి: రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడి మృతి

image

పాకాల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడని RPF చిత్తూరు SI ధర్మేందర్ రాజు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటుంది. తెలుపు రంగు నల్ల గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. తిరుపతికి వెళ్తున్న రైల్లో నుంచి జారి పడినట్లు అనుమానిస్తున్నారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2026

పెంటగాన్‌లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఏం జరగబోతోంది?

image

US రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల <<18781285>>పిజ్జా ఆర్డర్లు<<>> పెరిగితే ఏదో ఒక దేశానికి మూడినట్లేనని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. తాజాగా పాపా జాన్స్ ఆర్డర్లు 296%, డొమినోస్ 208%, పిజాటో ఆర్డర్లు 200% పెరిగాయి. పశ్చిమాసియాకు US మరిన్ని బలగాలను పంపనుందనే వార్తల నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. ‘కొన్ని గంటల్లో కీలక ప్రకటన’ అంటూ వైట్‌హౌస్ చేసిన ట్వీట్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. అసలేం జరగబోతోంది?

News March 27, 2026

‘థాంక్యూ ఇండియా’ అని మిస్సైల్‌పై రాసి..

image

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు మిస్సైళ్లతోనే ఇరాన్ సమాధానమిస్తోంది. ఈ క్రమంలో తమకు సంఘీభావం తెలిపిన దేశాలకు వినూత్నంగా కృతజ్ఞతలు చెబుతోంది. ‘థాంక్యూ జర్మన్ పీపుల్. థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’ అంటూ క్షిపణులపై సందేశాలు రాసి మరీ ప్రయోగిస్తోంది. స్పెయిన్, పాక్‌కూ ఇలానే థాంక్స్ చెప్పినట్లు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్‌, గల్ఫ్ దేశాల్లోని US బేస్‌లపై ఈ దాడులు చేసినట్లు IRGC తెలిపింది.