News April 14, 2024

దాడి ఘటన.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

image

నిన్న సీఎం జగన్‌‌పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. డ్రోన్లతో ఏరియల్ వ్యూ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అక్కడి CCTV ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాడికి ఎయిర్‌గన్ ఉపయోగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీ.. జగన్ బస చేస్తున్న కేసరపల్లి క్యాంప్ వద్దకు వెళ్లి కలిశారు.

Similar News

News March 10, 2026

ఆయిల్ సప్లైని ఆపేస్తే… ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్

image

హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఆయిల్ సప్లైని నిలిపివేసేందుకు యత్నిస్తే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల కంటే 20 రెట్ల బలంతో విరుచుకుపడతామని స్పష్టం చేశారు. తిరిగి కోలుకోలేని స్థాయిలో ఇన్‌ఫ్రాను ధ్వంసం చేస్తామన్నారు. అయితే అలాంటి పరిస్థితి రాబోదని ఆశిస్తున్నానన్నారు. చైనా సహా హార్ముజ్‌పై ఆధారపడిన దేశాలకు తానిచ్చే గిఫ్ట్ ఇదేనని వ్యాఖ్యానించారు.

News March 10, 2026

యుద్ధ భయం.. భారీగా పెరిగిన విమాన టికెట్ రేట్లు

image

మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతోన్న సంక్షోభాన్ని విమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దుబాయ్ నుంచి ముంబైకి నడిచే నాన్ స్టాప్ ఫ్లైట్‌లలో టికెట్ రేట్లను మార్చి 10-15 మధ్య ఏకంగా రూ.45-65వేలకు(సాధారణంగా రూ.10-20వేలు) పెంచాయి. ఇతర ప్రధాన నగరాలకూ ఇదే తరహా రేట్లు ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా ఒకదానికొకటి పోటీ పడి వసూలు చేస్తున్నాయి.

News March 10, 2026

వేలాది కోళ్లు మృతి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TGలోని నాగర్‌కర్నూల్(D)లో అంతుచిక్కని కారణంతో వేలాది కోళ్లు మృతి చెందాయనే సమాచారంతో AP ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుమతి లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్లను తీసుకురావొద్దని వ్యాపారులను ఆదేశించింది. సరిహద్దుల్లోని కోళ్ల ఫారాలపై నిఘా ఉంచాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించింది. చనిపోయిన కోళ్లను పూడ్చేయాలని తెలిపింది. అలాగే కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తినాలని ప్రజలకు సూచించింది.