News October 7, 2025

బెంగాల్‌లో BJP లీడర్లపై దాడి.. మోదీ వ్యాఖ్యలపై దీదీ అభ్యంతరం

image

బెంగాల్‌లో BJP MP, MLAఫై <<17928525>>దాడి<<>> జరిగిన ఘటన ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని PM మోదీ అన్నారు. TMC ప్రభుత్వం హింసపై కాకుండా ప్రజా సేవపై దృష్టి పెట్టాలన్నారు. మోదీ వ్యాఖ్యలపై సీఎం మమత స్పందిస్తూ ‘దీనిని రాజకీయం చేయొద్దు. PM అయ్యుండి బీజేపీ నేతగా మాట్లాడటం సరికాదు. BJP లీడర్లు వచ్చే ముందు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎలా నిందిస్తారు’ అని ప్రశ్నించారు.

Similar News

News October 7, 2025

శింబు-వెట్రిమారన్ సినిమాలో సమంత?

image

తమిళ హీరో శింబు, వెట్రిమారన్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆమెను మూవీ టీమ్ సంప్రదించిందని, చర్చలు జరుగుతున్నట్లు తెలిపాయి. ఈ ప్రాజెక్టును ‘వడ చెన్నై’ వరల్డ్‌లో భాగంగా రూపొందించనున్నట్లు డైరెక్టర్ ఇటీవల వెల్లడించారు. ధనుష్ హీరోగా నటించిన ‘వడ చెన్నై'(2018) సూపర్ హిట్‌గా నిలవగా, దాని యూనివర్స్‌లో మరిన్ని చిత్రాలు రానున్నాయి.

News October 7, 2025

తులసి పూజ సమయంలో చదవాల్సిన మంత్రం

image

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా:||
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్||
నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే|
నమో మోక్షప్రదే దేవి నమ: సంపత్ర్పదాయిని||
ఈ మంత్రాన్ని చదువుతూ తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి. <<-se>>#Shlokam<<>>

News October 7, 2025

నీట మునిగిన మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పొలంలో నీటిని బయటకు పంపాలి. వడలిన మొక్కలకు లీటరు నీటికి 5గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపంతో మొక్కలు పాలిపోయినట్లుంటే 10 లీటర్ల నీటికి 50గ్రా. అన్నభేదితో పాటు ఒక నిమ్మ చెక్క రసం కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు తేరుకున్నాక లీటరు నీటికి 5గ్రా. స్థూలపోషకాల మిశ్రమం, లీటరు నీటికి 2.5గ్రా. సూక్ష్మపోషకాల మిశ్రమం కలిపి ఒకదాని తర్వాత ఒకటి వారం వ్యవధిలో 2,3సార్లు పిచికారీ చేయాలి.