News November 13, 2024
కలెక్టర్‌పై దాడి కేసు.. BRS మాజీ ఎమ్మెల్యే అరెస్టు
TG: కొడంగల్ BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు <<14590479>>ఆరోపణలు<<>> ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న BRS నేత సురేశ్ ఆరోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News November 14, 2024
ఐదుసార్లు ఎమ్మెల్యే.. అత్యంత నిరాడంబర జీవితం!
TG: గల్లీ లీడర్లే దేశ ప్రధాని స్థాయిలో వీఐపీ ట్రీట్మెంట్ కావాలని ఫీలయ్యే రోజులివి. అలాంటిది ఇల్లెందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య 5సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా నిరాడంబరంగా జీవిస్తున్నారు. సైకిల్, RTC బస్సులే ఆయనకు ప్రయాణ సాధనాలు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంటి పరీక్షల కోసం వెళ్లారు. అందరితో పాటు వేచి చూసి తన వంతు వచ్చాక వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
News November 14, 2024
ఏపీ, తెలంగాణలో 3రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 16వరకు కుండపోత వర్షాలు పడతాయని అంచనా వేసింది. HYD వాతావరణంలో మార్పులు ఉంటాయని పేర్కొంది.
News November 14, 2024
ఉక్రెయిన్‌కు మద్దతివ్వడం US భద్రతకు కీలకం.. ట్రంప్‌తో బైడెన్
ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి బైడెన్‌తో ట్రంప్ <<14604330>>భేటీ<<>> అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ఆసక్తికర చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడం నేషనల్ సెక్యూరిటీకి ముఖ్యమని బైడెన్ చెప్పారు. యూరప్ బలంగా, స్థిరంగా ఉంటేనే యుద్ధం నుంచి US దూరంగా ఉండటం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు, యూరప్ అంశాల్లో ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే.