News November 4, 2024
కెనడాలో హిందూ ఆలయంపై దాడి.. ఖండించిన ప్రధాని మోదీ

కెనడా బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయంపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిని ప్రధాని మోదీ ఖండించారు. అలాగే దౌత్యవేత్తలను బెదిరించే పిరికి ప్రయత్నాలు గర్హనీయమని పేర్కొంటూ Xలో పోస్ట్ చేశారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత స్థైర్యాన్ని ఎన్నటికీ బలహీనపరచలేవని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయం జరిగేలా కెనడా ప్రభుత్వం చట్టాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.
Similar News
News January 5, 2026
USలో తెలుగు యువతి హత్య.. ఇండియాలో నిందితుడి అరెస్ట్?

USలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి నిఖిత గొడిశాల(27) హత్యకు గురైన కేసులో నిందితుడు అర్జున్ శర్మ అరెస్ట్ అయినట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఆ కథనాల ప్రకారం.. ఇంటర్‌పోల్ సాయంతో అతణ్ని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు తెలివిగా ఇండియాకు పారిపోయివచ్చాడు.
News January 5, 2026
సీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు తీర్పిచ్చారు: అచ్చెన్న

AP: నదీజలాల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని వ్యాఖ్యానించారు. హక్కుల విషయంలో ఏమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు.
News January 5, 2026
J&K మొత్తం ఇండియాలోనే ఉండాలి: బాబ్ బ్లాక్‌మన్

POK సహా J&K అంతా ఇండియాలోనే ఉండాలని బ్రిటన్ MP బాబ్ బ్లాక్‌మన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో భారత్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని జైపూర్లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ సభలో పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370ని తొలగించాలని 1992లోనే చెప్పానన్నారు. కశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్లగొట్టడాన్ని వ్యతిరేకించానని గుర్తుచేశారు. మతం పేరిట ప్రజలను వెళ్లగొట్టడం అన్యాయమని ప్రపంచానికి తెలిపానన్నారు.


