News May 20, 2024

భారత విద్యార్థులపై దాడి.. ఆరా తీసిన సీఎం

image

TG: కిర్గిస్థాన్‌లో భారత విద్యార్థులపై దాడి ఘటనపై CM రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆదేశాలతో అధికారులు బిష్కక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీతో మాట్లాడారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. స్థానిక ఘటనల్లో మన విద్యార్థులెవరూ గాయపడలేదని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు.

Similar News

News September 16, 2025

వివేకా హత్య కేసు: బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోలేమన్న SC

image

AP: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ సునీత వాదనపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయాలని సూచించింది. పిటిషన్ వేసిన 8 వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని, ట్రయల్ కోర్టును ఆదేశించింది.

News September 16, 2025

కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

image

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.

News September 16, 2025

భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

image

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.