News October 26, 2024
ఇరాన్‌పై దాడి: జాగ్రత్తపడిన ఇజ్రాయెల్!

ఇరాన్‌పై జరిపిన ప్రతీకార దాడి అంతర్జాతీయ సంఘర్షణలకు దారి తీయకుండా ఇజ్రాయెల్ జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. ఇరాన్‌కు చెందిన 20 వైమానిక స్థావరాలనే టార్గెట్ చేసింది. అక్కడి న్యూక్లియర్ ప్లాంట్లు, Oil రిఫైనరీలను టచ్ చేయలేదు. సార్వభౌమాధికారం గల దేశంపై దాడి చేస్తే ప్రతిదాడి తమ హక్కు అని నిరూపించడానికే Precise Strikes జరిపింది. దాడికి 100 F-35Adir, F-15I Ra’am, F-16I Sufa జెట్లను వాడింది.
Similar News
News December 31, 2025
విభూది మహిమ..

విభూతి వెనుక ఆరోగ్య రహస్యాలెన్నో ఉన్నాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరాన్ని వెచ్చగా, ఎండగా ఉన్నప్పుడు చల్లగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలను క్రమబద్ధీకరించి లోపలి శక్తి బయటకు పోకుండా కాపాడుతుంది. అందుకే మైనస్ డిగ్రీల చలిలో కూడా నాగసాధువులు విభూతిని పూసుకుని జీవించగలుగుతారు. పూర్వం స్వెటర్లు లేని రోజుల్లో పిల్లలకు చలి తగలకుండా విభూతిని ఒంటికి పూసేవారు.
News December 31, 2025
నిమెసులైడ్ తయారీ, సేల్స్పైనా కేంద్రం ఆంక్షలు

పెయిన్‌కిల్లర్ నిమెసులైడ్ తయారీ, సేల్స్‌పై కేంద్రం ఆంక్షలు విధించింది. 100mg కంటే ఎక్కువ పవర్ ఉండే ఈ మెడిసిన్ తయారీని వెంటనే ఆపేయాలని ఆదేశాలిచ్చింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో చర్చల తర్వాత హెల్త్ మినిస్ట్రీ నోటిఫికేషన్ ఇచ్చింది. ‘100mg కంటే ఎక్కువ డోస్ ఉండే నిమెసులైడ్ లివర్‌కు ప్రమాదం. దీనికి ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయి. దీనిపై తక్షణమే నిషేధం విధిస్తున్నాం’ అని పేర్కొంది.
News December 31, 2025
చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేను బెడద

చీని, నిమ్మ తోటల్లో కొన్నేళ్లుగా ఎగిరేపేను ఉద్ధృతి కనిపిస్తోంది. ఈ పురుగులు లేత ఆకులు, పూతను ఆశించి రసం పీల్చడం వల్ల ఆకులు వాడిపోయి, వంకర్లు తిరగడంతో పాటు పూత కూడా రాలిపోతోంది. దీని వల్ల మొక్కల పెరుగుదల ఆగిపోయి కొమ్మలు పై నుంచి కిందకు ఎండిపోతాయి. రసం పీల్చడం వల్ల ఆకులు, కాయలపై జిగురు వంటి పదార్థం విడుదలై నల్లని బూజు ఏర్పడుతుంది. ఎగిరే పేను వల్ల చీని, నిమ్మ తోటల్లో శంకు తెగులు కూడా వ్యాపిస్తుంది.


