News May 23, 2024
జగన్‌పై దాడి.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ 27కు వాయిదా

AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయగా, సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని నిందితుడి తరఫు లాయర్ న్యాయమూర్తిని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. ప్రస్తుతం సతీశ్ రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2026
సిరిసిల్ల: ‘ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి’

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతిఒక్కరూ తప్పక పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పరిధిలోని సినారె కళామందిరాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే కార్యక్రమాలు, టపాసులు పేల్చడం, భారీగా గుంపులు గుంపులుగా గుమి కూడడం, ఫంక్షన్ హాల్స్ లో సమావేశం ఏర్పాటు చేయడం నిషేధమన్నారు.
News February 13, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

కొచ్చిన్ పోర్ట్ అథారిటీ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in
News February 13, 2026
మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ విజయం

TG: మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 60 డివిజన్లలో 45 స్థానాలను సొంతం చేసుకుంది. BRS 5, BJP ఒక డివిజన్‌లో గెలుపొందాయి. అటు నల్గొండ, మహబూబ్‌నగర్, రామగుండంలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. BRS ఒక్క కార్పొరేషన్‌లోనూ సత్తా చాటలేకపోతోంది.


