News April 14, 2024

జగన్‌పై దాడి.. వైసీపీ, టీడీపీ మధ్య వార్

image

AP: ఎన్నికల వేళ CM జగన్‌పై దాడి ఘటన YCP, TDP మధ్య మాటల మంటలు రాజేసింది. ఇది కచ్చితంగా తెలుగుదేశం కుట్రేనని, ఘటన జరిగిన ప్రాంతం దగ్గర్లోనే ఓ టీడీపీ నేత ఆఫీస్ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్.. ఇప్పుడు రాయితో తనపై తానే దాడి చేయించుకున్నారని టీడీపీ విమర్శిస్తోంది. వైసీపీ, టీడీపీ పరస్పర ట్వీట్లతో Xలో #JaganMohanReddy హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Similar News

News March 24, 2026

ధురంధర్-3 ఉందా?

image

తొలి 2 పార్ట్‌లు బ్లాక్ బస్టర్ కావడంతో ధురంధర్-3 కూడా రానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 14న వస్తోందంటూ ఏకంగా రిలీజ్ డేట్ కూడా కొందరు వైరల్ చేస్తున్నారు. దీనిపై ధురంధర్ క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛబ్రా తాజాగా స్పందించారు. ‘చాలా రూమర్స్ వస్తున్నాయి. అలాంటిదేమీ లేదు’ అని తేల్చి చెప్పారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ధురంధర్-2‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

News March 24, 2026

మహిళలకు LSలో 273 సీట్లు.. APలో 12, TGలో 8?

image

లోక్‌సభ సీట్లు 816కి పెంచనుండడంతో 33.5% రిజర్వేషన్ల కోటా కింద మహిళలకు 273 స్థానాలు దక్కనున్నాయి. అత్యధికంగా UPలోని LS సీట్లు 120కి పెరుగుతుండడంతో అందులో 40 స్త్రీలకు దక్కుతాయి. MHలో 24, WB 21, TN, బిహార్‌లో 20 చొప్పున వారికి వెళ్తాయి. కాగా APలో 12-13, TGలో 8-9 LS స్థానాలు మహిళలకు దక్కే ఛాన్సుంది. కాగా విధివిధానాలు ఖరారయ్యాక ఎన్ని? ఏయే స్థానాలు మహిళలకు రిజర్వు అవుతాయో స్పష్టంగా తేలనుంది.

News March 24, 2026

GK: స్వాతంత్య్ర సమరయోధులు – రచనలు

image

☛ మహాత్మా గాంధీ – సత్యశోధన (My Experiments with Truth)
☛ జవహర్‌లాల్ నెహ్రూ – ది డిస్కవరీ ఆఫ్ ఇండియా
☛ బాల గంగాధర్ తిలక్ – గీతా రహస్యం (Karma-Yoga Shastra)
☛ లాలా లజపతిరాయ్ – అన్‌హ్యాపీ ఇండియా
☛ డా. బి.ఆర్. అంబేడ్కర్ – అనైలేషన్ ఆఫ్ కాస్ట్, థాట్స్ ఆన్ పాకిస్థాన్
☛ మౌలానా అబుల్ కలాం ఆజాద్ – ఇండియా విన్స్ ఫ్రీడమ్
☛ సుభాష్ చంద్రబోస్ – ది ఇండియన్ స్ట్రగుల్
☛ సరోజినీ నాయుడు- ది గోల్డెన్ త్రెషోల్డ్