News September 12, 2024

కౌశిక్‌పై దాడి.. మా పార్టీకి సంబంధం లేదు: TPCC చీఫ్

image

TG: అరికెపూడి గాంధీపై BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగా లేదని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ‘ఎవరు ఎవరిపై దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఈ దాడితో మా పార్టీకి సంబంధం లేదు. కౌశిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే గాంధీ అనుచరులు ఆగ్రహించారు. అరికెపూడి టెక్నికల్‌గా BRS సభ్యుడే. నిబంధనల మేరకే PAC ఛైర్మన్ అయ్యారు. ఉపఎన్నికలు వచ్చినా KTRకు నిరాశ తప్పదు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.

Similar News

News October 29, 2025

సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిలా ఎలా మారాడు?

image

పూర్వకాలంలో సంవత్సర ప్రారంభాన్ని కృత్తికా(కార్తీక) నక్షత్రంతో లెక్కించేవారు. ఆ నక్షత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి ఓ గొప్ప అనుబంధం ఉంది. ఈ నక్షత్రం ఆరు తారల సమూహం. సుబ్రహ్మణ్య స్వామిని కూడా షణ్ముఖుడు అని అంటారు. అంటే ఆరు తలలు గలవాడు అని అర్థం. ఆకాశంలో ఉన్న ఈ ఆరు కృత్తికా నక్షత్రాలే తల్లి రూపంలో వచ్చి ఆయనకు పాలు ఇచ్చాయట. అందువల్లే ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

News October 29, 2025

నేడు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

image

AP: తుఫాన్ వల్ల పత్తి రైతులు నష్టపోకూడదని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం కానున్నాయి. క్వింటాలుకు ₹8,110 మద్దతు ధర ఖరారు చేశారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను CM యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి.

News October 29, 2025

భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడే తొలి టీ20

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి T20 మ్యాచ్ ఇవాళ కాన్‌బెర్రాలోని మనూక ఓవల్ మైదానంలో జరగనుంది. మ.1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభవుతుంది. ODI సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన IND, 5 మ్యాచుల T20 సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
IND XI (అంచనా): అభిషేక్ శర్మ, గిల్, తిలక్, సూర్య(C), శాంసన్, దూబే, అక్షర్, సుందర్/కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్