News April 29, 2024
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వేటు!

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వేటు వేసేందుకు జేడీ(ఎస్) సిద్ధమైంది. అతణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే దానిపై దర్యాప్తు జరగాలన్నారు. ఈ కేసుతో దేవేగౌడకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Similar News
News January 1, 2026
ధనుర్మాసం: పదిహేడో రోజు కీర్తన

ద్వారపాలకుల అనుమతితో లోపలికి వెళ్లిన గోపికలు మొదట నందగోపుడిని, ఆపై యశోదమ్మను ‘మేలుకో’ అని వేడుకున్నారు. లోకాలను కొలిచిన త్రివిక్రమ స్వరూపుడైన కృష్ణుడిని నిద్రలేవమని ప్రార్థించారు. ఆపై బలరాముడిని నిద్రలేపడం మరచినందుకు చింతిస్తూ ‘బంగారు కడియాలు ధరించిన బలరామా! నీవు, నీ తమ్ముడు కృష్ణుడు వెంటనే మేల్కొనండి’ అని వేడుకున్నారు. ఇలా వరుసగా అందరినీ ప్రార్థిస్తూ, వారి కృప కోసం వేచి చూస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>
News January 1, 2026
యుద్ధంలో గెలిచేది మేమే: పుతిన్

ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో గెలిచేది తామేనని దేశం భావిస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో పోరాడుతున్న హీరోలను(సైనికులు) సపోర్ట్ ప్రజలను చేయాలని కోరారు. ‘మేం మీపై, మన విజయంపై నమ్మకం ఉంచుతున్నాం’ అని సోల్జర్లను ఉద్దేశించి న్యూఇయర్ ప్రసంగంలో అన్నారు. తన నివాసంపై ఉక్రెయిన్ <<18728652>>డ్రోన్ దాడి<<>> గురించి ఆయన ప్రస్తావించలేదు. పుతిన్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 31తో 26 ఏళ్లు పూర్తయ్యాయి.
News January 1, 2026
ఆపరేషన్ సిందూర్.. ప్రపంచానికి సందేశం: రక్షణ శాఖ

ఉగ్రవాదంపై పోరులో ఇండియా సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ గొప్ప నిదర్శనమని రక్షణ శాఖ తెలిపింది. కచ్చితత్వం, నైపుణ్యంతో మన బలగాలు పాక్ ఉగ్ర స్థావరాల గుండెల్లోకి లోతుగా దూసుకెళ్లి దెబ్బకొట్టాయని చెప్పింది. ‘ఈ ఆపరేషన్ ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపింది. భారత్ ఉగ్రవాదాన్ని సహించదని, దాన్ని ప్రోత్సహించే వారు ప్రతీకార చర్యను ఎదుర్కోవాల్సిందేనని తెలియజేసింది’ అని ఇయర్ ఎండ్ రివ్యూ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.


