News May 30, 2024
PSపై దాడి: 16 మంది జవాన్లపై కేసు

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో 16 మంది భారత జవాన్లపై కేసు నమోదైంది. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగింది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఆర్మీ సైనికుడి ఇంటిపై స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న సహచర సైనికులు PSపై దాడి చేసి పోలీసులను తీవ్రంగా కొట్టగా ఎస్ఐతో సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన 16 మంది జవాన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Similar News
News February 21, 2026
ఆ కామెంట్స్ తర్వాత 3 రోజులు నిద్రపట్టలేదు: శివాజీ

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై తాను చేసిన వివాదాస్పద <<18692465>>వ్యాఖ్యలపై<<>> నటుడు శివాజీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఏ మహిళనూ తక్కువ చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ‘నేను పబ్లిక్‌లో ఎప్పుడూ నోరు జారలేదు. ఆ రోజు 2 పదాలు ఎందుకు తప్పుగా మాట్లాడానో అర్థం కాలేదు. ఆ కామెంట్స్ తర్వాత 3 రోజులు నిద్ర పట్టలేదు. ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యా. కానీ నా ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు’ అని తెలిపారు.
News February 21, 2026
తల్లిపాలు పెంచే ఫుడ్స్ ఇవే..

మొదటిసారి తల్లైన తర్వాత మహిళలకు ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. వాటిల్లో ఒకటే తగినంత పాలు ఉత్పత్తికాకపోవడం. ఇలాంటప్పుడు కొన్ని ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పాలకూర, మెంతికూర, బ్రకోలీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, ఓట్స్, నువ్వులు, మెంతులు తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు. అలాగే వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు.
News February 21, 2026
ప్రేమ వివాహంపై పెద్దలకు సమాచారం: GJ ప్రభుత్వం

ప్రేమ వివాహాలపై పెద్దలకు సమాచారం ఇవ్వడాన్ని గుజరాత్ ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పెళ్లికి దరఖాస్తు చేసేవారు తమ పెద్దలకు సమాచారం ఇచ్చామని డిక్లరేషన్ ఇవ్వాలి. పైగా అమ్మాయి పేరెంట్స్‌కు అధికారులే అప్లికేషన్ షేర్ చేస్తారు. తప్పుడు సమాచారంతో వివాహాలు అడ్డుకునేందుకే GJ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రూల్స్‌లో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘ్వీ తెలిపారు.


