News February 10, 2025

రంగరాజన్‌పై దాడి.. స్పందించిన DCP

image

TG:చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల జరిగిన దాడి <<15408903>>ఘటనపై <<>>రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ స్పందించారు. ‘ఇవాళ ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించారు. సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను కోరారు. ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు’ అని చెప్పారు.

Similar News

News February 11, 2025

చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్‌కు 3.7B ఏళ్లు?

image

చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ 3.7 బిలియన్ ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. హై రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ సెంటర్, అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం ‘శివశక్తి’ పాయింట్‌ను (69.37°S, 32.32°E) మ్యాప్ చేసింది. అక్కడ చిన్న బండరాళ్లు, రాతి శకలాలున్నాయని పేర్కొంది.

News February 11, 2025

మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు: కమిషనర్

image

AP: మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 పెంచినట్లు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.

News February 11, 2025

MLC ఎలక్షన్స్: ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?

image

TG: రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 118 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. KNR-ADB-NZB-MDK గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్స్ స్థానానికి 15 మంది, WGL-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 13న మ.3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్ జరగనుంది.

error: Content is protected !!