News June 12, 2024

ఎర్రకోటపై దాడి.. దోషికి క్షమాభిక్ష నిరాకరణ

image

ఎర్రకోటపై దాడి ఘటనలో దోషిగా తేలిన ఉగ్రవాది మహమ్మద్ అరీఫ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. 24 ఏళ్ల క్రితం ఎర్రకోటపై లష్కరే తోయిబా ఉగ్రసంస్థ చేసిన దాడిలో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. ఈ దాడిలో దోషిగా తేలిన మహ్మద్ అరీఫ్‌కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ఉరిశిక్ష నుంచి మినహాయింపు(క్షమాభిక్ష) ఇవ్వాలని అరీఫ్ ముర్మును ఆశ్రయించారు.

Similar News

News November 2, 2025

ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

image

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.

News November 2, 2025

క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

image

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

News November 2, 2025

కరువు మండలాల జాబితా విడుదల

image

AP: 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కరువు మండలాల జాబితా విడుదల చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 3 జిల్లాల్లోని 37 మండలాలను ఈ కోవకు చెందినవిగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 37 మండలాలు కరువు బారిన పడినట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఆ పరిస్థితులు లేవని నివేదికలొచ్చినట్లు పేర్కొంది.