News January 19, 2025

సైఫ్‌పై దాడి.. థానేలో నిందితుడి అరెస్ట్!

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని థానేలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అతడిని ఓ రెస్టారెంట్ సమీపంలో గుర్తించినట్లు తెలిపింది. సుమారు 100 మంది పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Similar News

News February 2, 2026

HLL లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌లో 39 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుకు జనవరి 28 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 8 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BSc, BTech, CA, MSc, MBA/PGDM, MCA, MHA, MPH, BPMT, PGDMLT, MLT అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.20,000-రూ.2,20,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com

News February 2, 2026

మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలతో మేలు

image

☛ సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ☛ ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. ☛ తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. ☛ మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. ☛ మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. ☛ చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.

News February 2, 2026

KTRది నియంతృత్వ, రాచరికపు పోకడ: కవిత

image

TG: KCRను విచారణకు పిలవడమే నేరమన్నట్లు KTR మాట్లాడుతున్నారని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. ‘అభ్యర్థి చెడ్డోడైనా KCRను చూసి ఓటేయాలని మీరు కోరడమేమిటి? అది మీ రాచరికపు, నియంతృత్వపు పోకడకు నిదర్శనం. ఈ వైఖరి మారనంతవరకూ BRSను ఎవరూ కాపాడలేరు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జాగృతి తరఫున మంచి అభ్యర్థులను పెడుతున్నాం. ఆదుకొనే వారినే ప్రజలు ఎన్నుకోవాలి. FEB 20 తర్వాత ‘జనం బాట’ చేపడతాం’ అని కవిత తెలిపారు.