News January 26, 2025

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. మరో ట్విస్ట్!

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు మరో మలుపు తీసుకుంది. ఈ నెల 15న సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సైఫ్ నివాసంలో 19 సెట్ల వేలిముద్రల్ని క్లూస్ టీమ్ సేకరించగా, వాటిలో ఒక్కటి కూడా నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ వేలిముద్రలతో సరిపోలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ముంబై పోలీసులు మరోమారు ఘటనాస్థలాన్ని, సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 27, 2025

స్టాక్‌మార్కెట్లు విలవిల.. నిఫ్టీ 23,000 సపోర్టు బ్రేక్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 22,955 వద్ద చలిస్తోంది. కీలకమైన 23,000 సపోర్ట్ జోన్‌ను బ్రేక్ చేసింది. మరోవైపు సెన్సెక్స్ 440 పాయింట్లు పతనమై 75,774 వద్ద కొనసాగుతోంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.44% పెరిగి 17.83 వద్దకు చేరుకుంది. FMCG మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. BRITANNIA, HUL, ITC, ICICIBANK, NESTLE IND టాప్ గెయినర్స్.

News January 27, 2025

అమల్లోకి ‘ప్రత్యేక’ పాలన

image

TG: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం నిన్నటితో ముగిసింది. దీంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనెల 28తో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు కూడా ముగియనుంది. GHMC, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మరికొన్ని మున్సిపాలిటీల పదవీకాలం మరో ఏడాది ఉంది.

News January 27, 2025

డెలివరీ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్

image

పాపకు జన్మనిచ్చిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెల్లటి దుస్తుల్లో ఆమె ఓ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె లుక్ చూడగానే అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీపిక బొద్దుగా మారిపోయిందని, నటి రేఖలా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. కాగా దీపిక గత సెప్టెంబర్‌లో పాపకు జన్మనిచ్చారు. గర్భిణీగా ఉండగానే ‘కల్కి’ మూవీలో నటించారు.