News January 2, 2025
సంజయ్ రౌత్‌పై ఉద్ధవ్ అనుచరుల దాడి?
శివసేన(UBT) కీలక నేత సంజయ్ రౌత్‌పై ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ అనుచరులు దాడి చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధినేత నివాసమైన మాతోశ్రీలో స్వయంగా ఉద్ధవ్ కళ్ల ఎదుటే ఇది జరిగిందని అంటున్నారు. పార్టీ సమావేశం సందర్భంగా ఠాక్రే మద్దతుదారులకు, రౌత్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని, అది దాడి వరకూ వెళ్లిందని సమాచారం. రౌత్ వల్ల పార్టీ నష్టపోయిందన్న భావనలో ఉద్ధవ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 4, 2025
మణిపుర్ మిలిటెంట్లకు ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్!
మణిపుర్ మిలిటెంట్లు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ‘స్టార్ లింక్’ ఉపగ్రహం నుంచి వచ్చే ఇంటర్నెట్ సేవలు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో స్టార్ లింక్ ఇంటర్నెట్కు అనుమతి లేకపోయినా వారు వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పక్కనే ఉన్న మయన్మార్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్కు యాక్సెస్ ఉంది. కాగా గతేడాది మణిపుర్లో అల్లర్లు చెలరేగినప్పటి నుంచి అక్కడ కేంద్రం ఇంటర్నెట్ బంద్ చేసిన విషయం తెలిసిందే.
News January 4, 2025
కాంగ్రెస్ అప్పుడు ముద్దు ఇప్పుడు వద్దు: మారిన కేజ్రీ!
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎవరూ మెయిన్ ప్లేయర్‌గా భావించడం లేదు. అరవింద్ కేజ్రీవాలైతే లెక్కచేయడమే లేదు. తమ పోటీ BJPతోనే అన్నట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. కొద్ది వ్యవధిలోనే హస్తం పార్టీపై ఆయన వైఖరి మారిపోయింది. జైలుకెళ్లొచ్చిన కేజ్రీ పొత్తుకోసం పాకులాడటంతో ఢిల్లీ కాంగ్రెస్ వ్యతిరేకించినా AAPని రాహుల్ INDIA కూటమిలో చేర్చుకున్నారు. ఇప్పుడదే AK కాంగ్రెస్నెవరైనా <<15062903>>సీరియస్<<>>గా తీసుకుంటారా అనేశారు.
News January 4, 2025
‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలు భారీగా పెంపు
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు AP ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తొలిరోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. JAN 10న అర్ధరాత్రి ఒంటిగంట షో(బెన్ఫిట్)కు టికెట్ రూ.600కు అమ్ముకోవచ్చని తెలిపింది. మిగతా 5 షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.175, సింగిల్ స్క్రీన్లపై రూ.135 హైక్ ఇచ్చింది. 23వ తేదీ వరకూ రోజుకు ఐదు షోలకు హైక్‌తో టికెట్స్ విక్రయించుకోవచ్చని చెప్పింది.