News July 3, 2024

TDP ఆఫీసుపై దాడి.. పోలీసుల అదుపులో నిందితులు

image

AP: మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో మంగళవారం అర్ధరాత్రి పలువురిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను రెండు, మూడు రోజులుగా సేకరించారు. CC కెమెరాల ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఇందులో గుంటూరుకి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసుల గాలింపు చర్యలతో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Similar News

News July 5, 2024

‘ఎక్స్‌ట్రీమ్’ డెలివరీ సేవల్ని నిలిపేసిన జొమాటో?

image

గత ఏడాది అక్టోబరులో ప్రారంభించిన ‘ఎక్స్‌ట్రీమ్’ సేవల్ని జొమాటో నిలిపేసినట్లు సమాచారం. ది ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. డిమాండ్ లేని కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌ను తొలగించింది. అయితే దీనిపై సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జొమాటో క్రియాశీలంగా ఉన్న నగరాల్లో ఆహార డెలివరీ ఏజెంట్లతోనే చిన్న ప్యాకేజీలను డెలివరీ చేసేందుకు ఎక్స్‌ట్రీమ్‌ను సంస్థ ప్రారంభించింది.

News July 5, 2024

క్రెడిట్ కార్డు పేరుతో మోసం.. జాగ్రత్త: TG పోలీస్

image

క్రెడిట్ కార్డు పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని TG పోలీసులు సూచిస్తున్నారు. అప్లై చేయకుండానే క్రెడిట్ కార్డు మంజూరు అయినట్లు, ఆ కార్డుతో చెల్లింపులు జరిగినట్లు సైబర్ నేరగాళ్లు ప్రజలను సంప్రదిస్తున్నారని తెలిపారు. వెంటనే డబ్బు చెల్లించకపోతే అరెస్టు అవుతారని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా HYDలో ఓ మహిళా ఉద్యోగి ఇదే తరహాలో మోసపోయారని ట్వీట్ చేశారు.

News July 5, 2024

ఎంట్రీ ఇస్తే మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్దది!

image

జియో IPO వస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ప్రస్తుతం LIC ఐపీఓ (₹21వేల కోట్లు) టాప్‌లో ఉంది. మరోవైపు ₹25వేల కోట్లతో హ్యుందాయ్ ఐపీఓ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. కానీ జియో ఐపీఓ ఇందుకు రెండింతలు (₹55,500కోట్లు) ఉంటుందని జెఫరీస్ సంస్థ చెబుతోంది. ₹లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉండే సంస్థలు కనిష్ఠంగా 5% షేర్లు ఐపీఓలో పెట్టొచ్చు. కాగా జియో Mcap ₹11.11లక్షల కోట్లుగా ఉంది.