News July 15, 2024
ట్రంప్‌పై దాడి.. పెరిగిన బిట్‌కాయిన్ విలువ!

దాడి తర్వాత US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సానుకూలత పెరిగిందనే వార్తలు వస్తున్న వేళ క్రిప్టోకరెన్సీల విలువ పెరిగింది. బిట్‌కాయిన్ 8.6%, ఎథర్ 6.8% వృద్ధి చెందాయి. క్రిప్టోకరెన్సీకి అనుకూలంగా ఆయన మాట్లాడటమే కారణం. అధికార పార్టీ క్రిప్టోల నియంత్రణకు ప్రయత్నించడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మళ్లీ గెలిస్తే క్రిప్టోల కోసం ప్రత్యేక పాలసీ వస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.
Similar News
News November 21, 2025
వంటగది చిట్కాలు

* చపాతీ పిండిలో టేబుల్ స్పూన్ పాలు, బియ్యప్పిండి, నూనె వేసి ఐస్ వాటర్‌తో కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి.
* పల్లీలు వేయించేటప్పుడు 2 స్పూన్ల నీరు పోసివేయిస్తే తొందరగా వేగడంతో పాటు పొట్టు కూడా సులువుగా పోతుంది.
* కొత్త చీపురుని దువ్వెనతో శుభ్రం చేస్తే అందులో ఉండే దుమ్ము పోతుంది.
* వెల్లుల్లికి వైట్ వెనిగర్ రాస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
* పాలను కాచిన తర్వాత ఎండ, వేడి పడని చోట పెట్టాలి.
News November 21, 2025
ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలోని కొబ్బరి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.
News November 21, 2025
30న అఖిలపక్ష సమావేశం

DEC 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. చర్చల అజెండాలపై ఏకాభిప్రాయం, సజావుగా సమావేశాల నిర్వహణే లక్ష్యమని తెలిపారు. ఈసారి SIR అంశంపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ సాగనుంది. శీతాకాల సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.


