News May 5, 2024

రెజ్లర్ బజరంగ్ పూనియాపై వేటు

image

రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియాను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. సోనిపట్‌లో మార్చిలో జరిగిన ట్రయల్స్‌ సందర్భంగా బజరంగ్ తన మూత్ర నమూనాను ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో నాడా అతనిపై చర్యలు తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తేసే వరకు అతను ఏ టోర్నమెంట్‌లో లేదా ట్రయల్స్‌లో పాల్గొనలేరని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Similar News

News December 28, 2024

న్యూ ఇయర్.. మందుబాబులకు శుభవార్త

image

TG: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని సూచించింది.

News December 28, 2024

నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

image

AP: విజయవాడ కేబీఎన్ కాలేజీ వేదికగా నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ సభలను ప్రారంభించనుండగా, ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు. 2 రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు జరగనున్నాయి. దేశవిదేశాల నుంచి 1,500 మందికి పైగా భాషాభిమానులు, కవులు పాల్గొంటారు.

News December 28, 2024

టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ల కష్టాలు

image

TG: టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఫస్ట్ ప్రయారిటీ కాకుండా లాస్ట్/ఇతర ప్రయారిటీ ఇచ్చిన జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. చాలా దూరం ప్రయాణం చేసి పరీక్ష రాయాల్సి ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనవరి 11, 20వ తేదీల్లో జరిగే పరీక్షలకు హాల్ టికెట్లను ఇవాళ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.