News February 11, 2025

దేవుడి పేరుతో దాడులు దురదృష్టకరం: మంత్రి

image

TG: వీర రాఘవరెడ్డి, అతడి అనుచరుల దాడిలో గాయపడ్డ చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. దేవుడి పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామని, ఆలయం వద్ద భద్రత పెంచుతామని చెప్పారు. అటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఇతర నేతలు సైతం రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.

Similar News

News December 3, 2025

‘అఖండ-3’ ఉందని హింట్ ఇచ్చిన తమన్?

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈనెల 5న విడుదలవనుంది. ఈ సందర్భంగా రికార్డింగ్ స్టూడియోలో డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఫైనల్ ఔట్‌పుట్‌ను వీక్షించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఎండ్ కార్డ్ ఫొటోను Xలో పంచుకున్నారు. అందులో ‘జై అఖండ’ అని ఉండటంతో ఇది పార్ట్-3 టైటిల్ అనే చర్చ మొదలైంది. ‘అఖండ-2’ ముగింపులో సీక్వెల్ కొనసాగింపుపై డైరెక్టర్ లీడ్ ఇస్తారని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News December 3, 2025

రాజ్‌నాథ్ ఆరోపణలన్నీ నిరాధారాలే: కాంగ్రెస్

image

మాజీ ప్రధాని నెహ్రూపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ నిరాధార ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ చెప్పారు. సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణానికి ప్రజాధనం వినియోగించడానికి నిరాకరించిన నెహ్రూ, బాబ్రీ నిర్మాణానికి పన్నుల ద్వారా వచ్చిన నిధులు కేటాయించాలని ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. మాస్క్‌లు, ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలకు ప్రజాధనాన్ని వినియోగించకూడదని నెహ్రూ భావించేవారని ఠాగూర్ తెలిపారు.

News December 3, 2025

ముగిసిన సీఎం ఢిల్లీ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​లో నిర్వహించనున్న రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​కు రావాలని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారికి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అందజేశారు.