News December 11, 2024

మైనార్టీలపై దాడులు.. బంగ్లాదేశ్ కీలక ప్రకటన

image

బంగ్లాలో హిందువులు, మైనార్టీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 5 నుంచి అక్టోబర్ 22 వరకు 88 మతపరమైన హింసాత్మక దాడులు జరిగినట్లు వెల్లడించింది. 70మందిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగిన దాడులపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంది. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లా తాత్కాలిక సారథి యూనస్‌ను కలిసిన నేపథ్యంలో వివరాలు వెల్లడించారు.

Similar News

News November 22, 2025

నిటారుగా ఉండే కొండ దారి ‘అళుదా మేడు’

image

అయ్యప్ప స్వాములు అళుదా నదిలో స్నానమాచరించిన తర్వాత ఓ నిటారైన కొండ ఎక్కుతారు. ఇది సుమారు 5KM ఉంటుంది. ఎత్తైన గుండ్రాళ్లతో కూడిన ఈ దారి యాత్రికులకు కఠినమైన పరీక్ష పెడుతుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉండదు. స్వామివారి నామస్మరణతో మాత్రమే ఈ నిట్టనిలువు దారిని అధిగమించగలరని నమ్ముతారు. ఈ మార్గాన్ని దాటితేనే యాత్రలో ముఖ్యమైన ఘట్టం పూర్తవుతుందట. <<-se>>#AyyappaMala<<>>

News November 22, 2025

వరికి మానిపండు తెగులు ముప్పు

image

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News November 22, 2025

పాక్‌ ప్లాన్‌ను తిప్పికొట్టిన భారత్-అఫ్గాన్

image

ఇండియా, అఫ్గాన్ మధ్య దౌత్యమే కాకుండా వాణిజ్య సంబంధాలు కూడా బలపడుతున్న విషయం తెలిసిందే. దీనిని తట్టుకోలేని పాకిస్థాన్ వారి రోడ్డు మార్గాన్ని వాడుకోకుండా అఫ్గాన్‌కు ఆంక్షలు విధించింది. పాక్ ఎత్తుగడకు భారత్ చెక్ పెట్టింది. అఫ్గాన్ నుంచి సరుకు రవాణాకు ప్రత్యామ్నాయంగా జల, వాయు మార్గాలను ఎంచుకుంది. ఇరాన్ చాబహార్ పోర్టు నుంచి జల రవాణా, కాబుల్ నుంచి ఢిల్లీ, అమృత్‌సర్‌కు కార్గో రూట్లను ప్రారంభించింది.