News September 16, 2024

సూఫీ మందిరాలపై దాడులు.. బంగ్లాలో కలకలం

image

బంగ్లాదేశ్‌లో వర్గ వైషమ్యాలు తగ్గడం లేదు. కొన్నాళ్ల కిందట చెలరేగిన హింసలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. భారత స్నేహ చిహ్నాలను బద్దలుకొట్టారు. తాజాగా సూఫీ మందిరాలు, స్థలాలపై దుండుగులు దాడులు చేస్తుండటంతో ఆ వర్గంవారే సొంతంగా భద్రతను చూసుకుంటున్నారు. రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు. ఉర్సు నిర్వహిస్తుండగా నిన్న రాత్రి సిలెట్‌లో హజ్రత్ షా పరన్‌ కట్టడంపై దాడి జరగడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

Similar News

News January 11, 2026

మరో యాదాద్రిగా కీసరగుట్ట? మోక్షం ఎన్నడు!

image

HYD శివారు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరో యాదాద్రి దేవాలయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. నాటి నుంచి కోట్లాది మంది భక్తులు రాష్ట్రంలో మరో యాదాద్రి స్థాయిలో కీసరగుట్టను చూడాలనే ఆశతో వేచి చూస్తున్నారు. కానీ.. ఇప్పటి వరకు ప్రాజెక్టు ముందుకు పడకపోవడం, దేవాలయం వద్ద పనులు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News January 11, 2026

IMH కడపలో 53 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, కడపలో 53 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల 42ఏళ్లలోపు అభ్యర్థులు జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా(ఆక్యుపేషనల్ థెరపీ, ECG,అనస్థీషియా, యోగా), BA, BSc, MSW, DMLT, MLT, MA(సైకాలజీ), పీజీ డిప్లొమా(మెడికల్ & సోషల్ సైకాలజీ), M.Phil ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in

News January 11, 2026

శ్రీవారిని గురువారం నాడు దర్శించుకుంటే..?

image

శ్రీవారిని ప్రతి గురువారం నిజరూపంలో దర్శించుకోవచ్చు. వారంలో 6 రోజులు సర్వాభరణ భూషితుడై ఉండే స్వామి గురువారం మాత్రం నిరాడంబరంగా దర్శనమిస్తారు. నొసటన ఉండే పచ్చకర్పూరపు నామాన్ని తగ్గించడం వల్ల భక్తులు స్వామివారి నేత్రాలను నేరుగా చూసే భాగ్యం కలుగుతుంది. అందుకే దీన్ని నేత్ర దర్శనమని అంటారు. కేవలం పట్టుధోవతి, తలపాగా ధరించి దేదీప్యమానంగా వెలిగే స్వామివారి ఈ నిజరూపం పరమానందాన్ని, శాంతిని చేకూరుస్తుంది.