News January 5, 2025
మన అస్తిత్వాన్ని దెబ్బతీయడానికే దేవాలయాలపై దాడులు: ఎల్వీ
AP: ఎన్నో శతాబ్దాలుగా దేవాలయాన్ని ఒక గ్రంథాలయం, గోశాల, ఔషధాలయం, అన్నవితరణ కేంద్రంగా భావిస్తున్నామని మాజీ CS ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. మన అస్తిత్వాన్ని కాపాడుతున్న కేంద్రాలుగా ఆలయాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దాన్ని దెబ్బతీయడానికే ముష్కరులు దాడులు చేశారని పేర్కొన్నారు. ఆలయాల ఉన్నతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
Similar News
News January 7, 2025
నేటి నుంచి విధుల్లోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు
TG: పలు డిమాండ్లతో గత కొన్ని రోజులుగా విధులను బహిష్కరించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. Dy.CM భట్టితో చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. విద్యాశాఖలో విలీనం, పే స్కేల్ అమలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ వంటివి అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు.
News January 7, 2025
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS వర్తింపు
AP: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో రిటైర్డ్ ఎంప్లాయిస్, వారి భాగస్వామికి EHSలో వైద్య సదుపాయం ఉండేది. 2020లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక ఈ సదుపాయం లేకుండా పోయింది. దీనిపై ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
News January 7, 2025
టీచర్లకు పాయింట్ల ఆధారంగా గుర్తింపు!
AP: మెరుగైన పనితీరు కనబరిచిన టీచర్లకు పాయింట్ల ఆధారంగా గుర్తింపు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగా తీసుకురాబోయే బదిలీల చట్టంలో దీని ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. ప్రోత్సాహం లేకపోతే పనిలో పోటీ ఉండదని విద్యాశాఖ భావిస్తోంది. అటు బదిలీలకు విద్యా సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పాయింట్ల విధానం కచ్చితంగా అమలు చేస్తారా? అనేదానిపై స్పష్టత లేదు.