News April 21, 2025

నక్సలిజం అంతమయ్యే వరకూ దాడులు ఆపం: అమిత్ షా

image

నక్సలిజాన్ని తుదముట్టించేంత వరకూ భద్రతా బలగాల దాడులు కొనసాగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రూ.కోటి రివార్డున్న వివేక్ అనే మావోయిస్టుతో పాటు మరో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారని తెలిపారు. నక్సల్స్ ఏరివేతలో భద్రతా బలగాలు విజయం సాధించాయన్నారు. కాగా 2026 మార్చి 31 కల్లా నక్సల్ రహిత దేశంగా భారత్‌ నిలుస్తుందని అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News August 8, 2025

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా 2026 APR 3న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని టాక్. అలాగే పాటలు తప్ప మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News August 8, 2025

YS భాస్కర్‌రెడ్డి, శివశంకర్ రెడ్డికి నోటీసులు

image

AP: TDP నేత విశ్వనాథరెడ్డిని బెదిరించిన కేసులో YS భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి పోలీసులు నోటీసులిచ్చారు. కడప పోలీసులు HYD వెళ్లి 41A నోటీసులు అందజేశారు. విశ్వనాథరెడ్డి ఇటీవలే బీటెక్ రవి సమక్షంలో TDPలో చేరారు. ఈ నేపథ్యంలో తనను భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, MP అవినాశ్ PA, తదితరులు బెదిరించారని కాల్ డేటా సమర్పించారు. దాంతో కేసు నమోదైంది. వీళ్లిద్దరూ వివేకా హత్యకేసులోనూ నిందితులు.

News August 8, 2025

గిఫ్టులు, డబ్బులు రెడీనా బ్రదర్స్!

image

రేపే రాఖీ పండుగ. తెలుగు రాష్ట్రాల్లోని రాఖీ షాపులు కిటకిటలాడుతున్నాయి. అక్కాచెల్లెళ్లను సంతోషపరిచేందుకు సోదరులు గిఫ్టు షాపులు, ఏటీఎంల చుట్టూ తిరిగేస్తున్నారు. చెల్లెమ్మలు తమ కావాల్సినవి ఇండైరెక్ట్‌గా తెలిపేందుకు అన్నలకు ఇన్‌స్టా రీల్స్‌ షేర్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తమ ప్రియమైన సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడపడుచులు సొంతూళ్లకు బయల్దేరారు.