News September 14, 2024
MLA గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు

TG: శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. BRS MLA కౌశిక్‌రెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. గాంధీతో పాటు తన సోదరుడు, కుమారుడు, కార్పొరేటర్లు వెంకటేశ్, శ్రీకాంత్ గౌడ్‌పైనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో కొందరు కౌశిక్‌రెడ్డిపై రాళ్లతో దాడి చేశారు.
Similar News
News November 23, 2025
రోజూ నవ్వితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌తో సతమతమవుతున్న వారికి నవ్వు ఉత్తమ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే శరీరానికి, మనసుకు అపారమైన లాభాలు కలుగుతాయి. నవ్వు ఒత్తిడిని తగ్గించి టైప్-2 డయాబెటిస్‌ను, బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వు సహజ పెయిన్‌కిల్లర్‌లా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
News November 23, 2025
గనుల సీనరేజీ పాలసీని సరళీకృతం చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

AP: వైసీపీ హయాంలో మైనింగ్‌పై ఆధారపడిన వారికి దినదినగండంగా గడిచిందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రస్తుతం ఈ రంగంలో పారదర్శకంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గనుల సీనరేజీ పాలసీని త్వరలోనే సరళీకృతం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లోనూ మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. ఇక నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ కొనసాగుతోందని, ఎంతటివారున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు.
News November 23, 2025
రెండో టెస్టు.. దక్షిణాఫ్రికా ఆలౌట్

గువాహటిలో జరుగుతున్న రెండో టెస్టులో ఎట్టకేలకు దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన ముత్తుస్వామి (109) శతకం బాదారు. జాన్సెన్ (93) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. టీమ్ ఇండియా బౌలర్లలో కుల్దీప్ 4, జడేజా, సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. టీమ్ఇండియా తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.


