News May 25, 2024
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు

AP: మాచర్ల YCP అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. TDP ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా.. అడ్డుకోబోయిన తనపై దాడి చేసినట్లు శేషగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా హైకోర్టు <<13303648>>ఆదేశాలున్నా<<>> పిన్నెల్లిపై మరో తప్పుడు కేసు పెట్టారని YCP మండిపడుతోంది.
Similar News
News November 28, 2025
ప్రకాశం: పొగ మంచు కురుస్తోంది.. జాగ్రత్త.!

ప్రస్తుతం జాతీయ రహదారుల్లో అధికంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వాహనదారులు, డ్రైవర్లకు శుక్రవారం పలు సూచనలు జారీ చేసింది. హైవేల్లో రాకపోకలు సాగించే వాహనాలకు కాస్త గ్యాప్తో ప్రయాణించాలన్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ సమయాలలో కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో జాగ్రత్త వహించాలన్నారు.
News November 28, 2025
స్వామి సన్నిధానాన్ని చేరేందుకు.. కష్టాన్ని కూడా మర్చిపోతారు

శబరిమల యాత్రలో నీలిమల కొండను కఠినమైన సవాలుగా భావిస్తారు. కానీ, అయ్యప్ప నామ స్మరణతో సులభంగా ఈ కొండను ఎక్కేస్తారు. అయితే ఇక్కడి నుంచే భక్తులకు సన్నిధానానికి త్వరగా చేరాలనే ఉత్కంఠ, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలనే ఆత్రుత మొదలవుతాయట. స్వామి దర్శనం పట్ల ఉండే ఈ అపారమైన భక్తి భావమే ఈ కఠినమైన దారిని సులభంగా దాటేలా చేస్తుందని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>
News November 28, 2025
128 మంది మృతి.. కారణమిదే!

హాంగ్కాంగ్లోని అపార్ట్మెంటలో ఘోర <<18395020>>అగ్నిప్రమాదం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 128 మంది మరణించగా 79 మంది గాయపడ్డారు. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఆయా అపార్ట్మెంట్లలో ఫైర్ అలారాలు పనిచేయకపోవడంతో నివాసితులు మంటలను గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. 128మంది సజీవదహనానికి ఇదే కారణమని భావిస్తున్నారు.


