News March 18, 2024
అంబానీ వేడుకలో చోరీకి యత్నం!
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో ఇటీవల ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో చోరీ చేసేందుకు తమిళనాడుకు చెందిన ఓ ముఠా యత్నించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కట్టుదిట్టమైన భద్రత కారణంగా ఆ ఈవెంట్కు వెళ్లలేకపోవడంతో జామ్నగర్లోని కొన్ని కార్ల అద్దాలు బద్దలుగొట్టి దొంగతనాలు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం ఆరుగుర్ని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.
Similar News
News November 15, 2024
పాకిస్థాన్లో బాంబు పేలుడు.. పలువురి మృతి
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో నిన్న సాయంత్రం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు మృతిచెందారని, 14మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రసూల్ జాన్ అనే తాలిబాన్ ఉగ్రవాది తన ఇంటి వద్ద కారులో బాంబును బిగిస్తుండగా అది పేలిందని పేర్కొన్నారు. తాలిబాన్లు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాల్ని తరలించారని వెల్లడించారు.
News November 15, 2024
రోహిత్ పారిపోయే కెప్టెన్ కాదు: కైఫ్
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ సవాళ్ల నుంచి పారిపోయే కెప్టెన్ కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు. వీలుంటే వెంటనే టెస్టు జట్టుతో చేరేవారని పేర్కొన్నారు. ‘రోహిత్ ఓ నాయకుడు. ఆయనలో పారిపోయే నైజం లేదు. తొలి టెస్టు నుంచే ఆడాలని ఆయన కచ్చితంగా అనుకుంటూ ఉంటారు. అందుకే గైర్హాజరీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇంట్లో పరిస్థితి ఓకే అనుకుంటే వెంటనే పెర్త్కు వచ్చేస్తారు’ అని తెలిపారు.
News November 15, 2024
గ్రేప్4 అమలైతే ఢిల్లీ పరిస్థితి ఏంటి?
DL రిజిస్ట్రేషన్ గల BS-6 సొంత వాహనాలు, అత్యవసర సరుకు రవాణా కమర్షియల్ వాహనాలనే నగరంలోకి అనుమతిస్తారు. 6-9, 11వ తరగతులకూ <<14615373>>ఆన్లైన్ క్లాసులే<<>> ఉండాలని ప్రభుత్వం ప్రకటించే అధికారం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు 50% స్టాఫ్నే పిలవాలని ఆదేశించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ, కూల్చివేత పనుల నిషేధం. కాలుష్యం ఇంకా తీవ్రమైతే అన్ని విద్యాసంస్థలూ మూసేయడంతో పాటు అత్యవసర వాహనాలే తిరిగాలనే ఆంక్షలొస్తాయి.