News April 3, 2025
మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చే ప్రయత్నం: కాంగ్రెస్ MP

దేశంలో ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నాజిర్ హుస్సేన్ ఆరోపించారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 123 ఆస్తులపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. అసత్య ప్రచారాలతో దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Similar News
News April 4, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 58,864 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో కొండపై భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది.
News April 4, 2025
చరిత్ర సృష్టించిన కోల్‌కతా నైట్‌రైడర్స్

ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చరిత్ర సృష్టించింది. మూడు వేర్వేరు జట్లపై 20కిపైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఆ జట్టు PBKS-21, RCB-20, SRHపై 20 విజయాలు సాధించింది. నిన్న SRHతో జరిగిన మ్యాచులో ఆ జట్టు ఈ ఘనత సాధించింది. కాగా సన్‌రైజర్స్‌పై కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
News April 4, 2025
చైనీస్‌తో శారీరక సంబంధాలపై అమెరికా బ్యాన్

చైనీయులతో ప్రేమ, పెళ్లి, శారీరక సంబంధాలు ఏర్పరుచుకోవద్దని అమెరికా తమ దేశ ఉద్యోగస్థులను హెచ్చరించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, కాంట్రాక్టర్లు, వారి కుటుంబసభ్యులకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. కాగా ఇటీవల చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ తన బాధ్యతల నుంచి తప్పుకోగానే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.