News December 12, 2024
మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు
నటుడు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. TV9 రిపోర్టర్‌పై దాడి చేసినందుకు నిన్న ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద FIR నమోదు చేసిన పోలీసులు ఇవాళ దాన్ని మార్చారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. మరోవైపు ఘర్షణలో గాయపడ్డ మోహన్‌బాబు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News December 12, 2024
నిఖేశ్ అక్రమార్జన రోజుకు రూ.2 లక్షలు!
TG: నీటిపారుదలశాఖ AEE నిఖేశ్ కుమార్ అక్రమార్జన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన అక్రమార్జన రోజుకు ₹.2లక్షలకు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. జాబ్‌లో చేరిన 10ఏళ్లలోనే ₹.100కోట్లు కూడబెట్టారని సమాచారం. ఒక్కో ఫైల్‌కే ఆయన ₹.50లక్షల లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. FTL, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల కోసం ఆయన లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని, ఈ కేసులో ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.
News December 12, 2024
హ్యాపీ బర్త్ డే మై బ్రో: హర్భజన్
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బర్త్ డే కావడంతో క్రికెట్ అభిమానులు, సహచరుల ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా యువీకి హర్భజన్ సింగ్ విషెస్ తెలిపారు. ‘నా సోదరుడికి హ్యాపీ బర్త్ డే. ఈరోజు ప్రేమ, వినోదంతో నిండాలని కోరుకుంటున్నా. మీ వ్యక్తిత్వం, నెవర్ గివప్ ఆటిట్యూడ్, పాజిటివ్‌తో ఉండే మీ స్వభావం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ ఉండండి’ అని భజ్జీ ట్వీట్ చేశారు.
News December 12, 2024
వైసీపీలో ఎవరికీ గౌరవం లేదు: అవంతి శ్రీనివాస్
AP: వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. YCPకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీలో ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి. అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకోరు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా కాకముందే ధర్నాలు చేయడమేంటి? ప్రతి విషయాన్ని ఆ పార్టీ రాజకీయం చేస్తోంది. జమిలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ధర్నాలు, నిరసనలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.