News May 3, 2024
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై హత్యాయత్నం కేసు

AP: మచిలీపట్నం YCP MLA అభ్యర్థి, మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది. నిన్న ఆయన ప్రచారంలో ఉండగా జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కొందరు YCP కార్యకర్తలు చొరబడి దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కిట్టుని A1గా చూపగా.. మరో ఐదుగురి YCP నేతలపైనా హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఇదే కేసులో ఓ మహిళను దూషించారంటూ కర్రి మహేశ్‌పై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Similar News
News November 4, 2025
రోడ్ల నాణ్యతలో రాజీపడొద్దు: Dy.CM పవన్

AP: గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ‘సాస్కి’ పథకం ద్వారా సమకూర్చిన రూ.2 వేల కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘రహదారుల నాణ్యతలో రాజీపడొద్దు. అధికార యంత్రాంగానిదే బాధ్యత. ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నారో లేదో తనిఖీ చేయాలి. నేను, నిపుణులు క్షేత్రస్థాయిలో క్వాలిటీ చెక్ చేస్తాం’ అని చెప్పారు. రోడ్ల విషయంలో గత ప్రభుత్వం అలక్ష్యంతో వ్యవహరించిందని ఆరోపించారు.
News November 4, 2025
భారీ జీతంతో ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇంజినీరింగ్ పూర్తైన, చివరి సంవత్సరం చదువుతున్నవారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)లో చేరేందుకు ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ మార్కుల మెరిట్‌తో ఎంపిక చేస్తారు. ఏడాది శిక్షణలో రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత మొదటి నెల నుంచే రూ.లక్ష వరకు శాలరీ ఉంటుంది. పెళ్లికాని 20-27ఏళ్ల మధ్య ఉన్న పురుషులు అర్హులు. ఇక్కడ <
News November 4, 2025
‘ది రాజాసాబ్’ విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మూవీ టీమ్ ఖండించింది. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


