News December 13, 2024
హత్యాయత్నం కేసు.. మోహన్‌బాబు ఇంటికి పోలీసులు

జల్పల్లిలోని నటుడు మోహన్‌బాబు ఇంటికి కాసేపట్లో పహాడీ షరీఫ్ పోలీసులు వెళ్లనున్నారు. రిపోర్టర్‌పై హత్యాయత్నం కేసులో ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. మోహన్‌బాబు వెపన్‌ను సీజ్ చేయనున్నారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు.
Similar News
News December 29, 2025
నవీన్ యాదవ్ ఎన్నిక రద్దు చేయాలి: హైకోర్టులో సునీత పిటిషన్

TG: జూబ్లీహిల్స్ MLAగా నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని BRS అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో కేసుల వివరాలు తక్కువగా చూపారని ఆరోపించారు. ప్రచారంలో కూడా రూల్స్ ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, సునీత దాఖలు చేసిన పిటిషన్ రిజిస్ట్రీ వద్ద పెండింగ్‌లో ఉంది.
News December 29, 2025
సీరియల్ నటి నందిని ఆత్మహత్య

ప్రముఖ కన్నడ-తమిళ్ సీరియల్ నటి నందిని(26) సూసైడ్ చేసుకున్నారు. బెంగళూరులోని తన ఫ్లాట్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్లో పాపులర్ అయిన ‘గౌరీ’ సీరియల్లో దుర్గ, కనకగా ఆమె డబుల్ రోల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందిని పెళ్లి విషయంలో పేరెంట్స్ ఒత్తిడి చేయడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
News December 29, 2025
మున్సిపల్ ఎన్నికలు.. JAN 10న ఓటరు జాబితా

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ షెడ్యూల్ విడుదల చేసింది. JAN 1న ముసాయిదా ఓటరు జాబితాలు ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. అదే నెల 10న తుది ఓటరు జాబితాను విడుదల చేయాలని పేర్కొంది. కాగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.


