News October 20, 2024

ఆ ఇంటర్ విద్యార్థులకు హాజరు మినహాయింపు

image

TG: ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు చదివే ప్రైవేట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది. వారికి హాజరు నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది. హాజరు మినహాయింపు కోరుకునే విద్యార్థులు నవంబర్ 20వ తేదీలోగా రూ.500 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. రూ.200 ఫైన్ చెల్లించి డిసెంబర్ 18 వరకూ అప్లై చేసుకోవచ్చని పేర్కొంది.

Similar News

News December 4, 2025

సిరి ధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో లాభం

image

చిరు ధాన్యాల సాగు, వినియోగం క్రమంగా పెరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలే దీనికి కారణం. చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ని, BP, షుగర్, గుండె వ్యాధుల ముప్పును తగ్గించి రక్తహీనతను దూరం చేస్తాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు తొందరగా అలసిపోకుండా ఉండేందుకు మిల్లెట్స్ దోహదపడతాయి.

News December 4, 2025

SGB బొనాంజా.. గ్రాముకు రూ.9,859 లాభం

image

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4న విడుదల చేసిన సిరీస్‌-X బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,961గా RBI నిర్ణయించింది. తాజాగా ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,820గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,859 లాభం(333%) వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. ఇటీవల సిరీస్‌-VI బాండ్లకు ₹9,121 లాభం వచ్చిన విషయం తెలిసిందే.

News December 4, 2025

పుతిన్ పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

image

* ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ బాగా ఉపయోగపడ్డాయి. పుతిన్ పర్యటనలో మరిన్ని S-400లతో పాటు S-500 కొనుగోలుకు ఆమోదం లభించనుంది.
* రఫేల్, F-21, F/A-18, యూరో ఫైటర్ టైఫూన్లకు పోటీనిచ్చే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపైనా చర్చలు జరుగుతాయి. ఇవి రఫేల్ కంటే తక్కువ ధరకే లభించడం విశేషం.