News April 13, 2024

జాగ్రత్త.. ఈ జాబితాలో మీ ప్రాంతం పేరుందా?

image

AP: రాష్ట్రంలోని 57 మండలాల్లో ఇవాళ వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, 111 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వడగాలులు వీచే మండలాల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News February 2, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.9,050 తగ్గి రూ.1,51,530కు చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.8,300 తగ్గి రూ.1,38,900 పలుకుతోంది.

News February 2, 2026

వేరుశనగలో అంతర పంటలతో లాభాలేంటి?

image

వర్షాభావ పరిస్థితులు, బెట్ట, కరవు పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంట అయిన వేరుశనగ నష్టపోయినా.. అంతర పంటల నుంచి కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వేరుశనగ, అంతరపంటల వేరువ్యవస్థ పొడవులో తేడాల వల్ల భూమిలోని పోషకాలు, నీటిని పంటలు సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. చీడపీడల ఉనికి చాలావరకు తగ్గుతుంది. వర్షపునీటిని పొలంలోనే ఇంకేటట్లు చేయడంలో, నేలకోతను నివారించడంలో అంతరపంటలు కీలకపాత్ర పోషిస్తాయి.

News February 2, 2026

ఏ గ్రహానికి ఏ నైవేద్యం సమర్పిస్తే శుభం?

image

ఆదిత్యుడు – గోధుమలు, రవ్వ చక్కెర పొంగి
చంద్రుడు – పెరుగన్నం
అంగారకుడు – కందిపప్పు అన్నం
బుధుడు – పెసరపప్పు అన్నం
గురు – సెనగపప్పు అన్నం
శుక్రుడు – చిక్కుడు గింజల అన్నం
శని – నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు – మినుములతో కూడిన అన్నం
కేతువు – ఉలవల అన్నం