News January 4, 2025
అతుల్ భార్యకు బెయిల్ మంజూరు
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా తన మరణానికి భార్య, అత్త కారణమని అతుల్ 40 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో గత నెల 14న నికిత, నిషా, అనురాగ్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వీరు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.
Similar News
News January 6, 2025
దీర్ఘాయువు కోసం వీటిని పాటించండి!
సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి మూడు సూత్రాలు ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ‘రెడ్ మీట్ స్థానంలో చేప మాంసాన్ని తినండి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. మీ వైద్యుడితో చర్చించి మీకు ఉత్తమమైన ఆహారం ఏంటో తెలుసుకోండి. క్రమం తప్పకుండా రోజూ ఏరోబిక్ వ్యాయామాలు, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. అనేక వ్యాధులకు ఒంటరితనం ప్రధాన కారకం. దీర్ఘాయువు కోసం స్నేహితులు, కుటుంబంతో రోజూ కొంత సమయం గడపండి’ అని తెలిపారు.
News January 6, 2025
అందరూ పరిశుభ్రత పాటించాలి: ICMR
hMPV వైరస్పై ఎవరూ ఆందోళన చెందవద్దని ICMR తెలిపింది. సాధారణ వైరస్ల మాదిరిగానే దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది. జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది. చిన్నారులు, వృద్ధుల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. సీజనల్ శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొనేందుకు దేశంలోని అన్ని ఆస్పత్రులు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేసింది.
News January 6, 2025
ప్రతి ఆస్పత్రిలో 20 ఐసోలేషన్ బెడ్స్: మంత్రి సత్యకుమార్
AP: దేశంలో hMPV కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతి ఆస్పత్రిలో 20 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ICMR అడ్వైజరీ మాత్రమే ఇచ్చిందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.