News August 20, 2024

AU: రేపటి పరీక్షలు వాయిదా

image

వివిధ సంఘాల భారత్ బంద్‌కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరగాల్సిన యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో ఏయూ వెబ్‌సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. విద్యార్థులు దీనిని గమనించాలని ఆమె సూచించారు.

Similar News

News November 8, 2025

విశాఖ: ‘పెండింగ్‌లో ఉన్న నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు వేగవంతం’

image

దసరా, దీపావళి, GST సంస్కరణల సందర్భంగా ప్రజలు వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఎక్కువ సంఖ్యలో వాహనాలు కొనుగోలు జరగడంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పెండింగ్‌ వలన రవాణా శాఖ కార్యాలయంలో అదనపు సిబ్బందిని వినియోగించి వాహనాలకు శుక్రవారం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించామని DTC R.C.H.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక నంబర్లు కొనుగోలు చేసిన వారికీ నంబర్లు కేటాయించిన వెంటనే వాటిని అప్రూవల్ చేస్తామన్నారు.

News November 7, 2025

విశాఖ: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

image

13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్లలో కనీసం 6 నెలల బిల్లులను వెంటనే చెల్లించాలని GVMC కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం GVMC గాంధీ విగ్రహ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేపట్టారు. బిల్లులు చెల్లించకపోతే ఇక పనులు చెయ్యలేమన్నారు. GVMC బడ్జెట్ ఉన్న వర్కులకు మాత్రమే టెండర్లు పిలవాలన్నారు. ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లి GVMC కమిషనర్, మేయర్‌‌కు వినతిపత్రం అందజేశారు.

News November 7, 2025

విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

image

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.