News August 20, 2024
AU: రేపటి పరీక్షలు వాయిదా
వివిధ సంఘాల భారత్ బంద్‌కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరగాల్సిన యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో ఏయూ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. విద్యార్థులు దీనిని గమనించాలని ఆమె సూచించారు.
Similar News
News September 21, 2024
ఎస్.రాయవరంలో గురజాడ జయంతికి ఏర్పాట్లు
మహాకవి గురజాడ వేంకట అప్పారావు జయంతి నిర్వహించేందుకు ఆయన జన్మస్థలమైన ఎస్.రాయవరం గ్రామంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న గురజాడ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దారు. ఈ సందర్భంగా గ్రామంలో శుక్రవారం, శనివారం గురజాడ జయంతి వేడుకలు జరుపుతామని గురజాడ ఫౌండేషన్ సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు తెలిపారు.
News September 20, 2024
విశాఖ: అత్యాచారం కేసులో సంచలన తీర్పు
విశాఖలో బాలికపై అత్యాచారం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ముద్దాయి జీ.వెంకట రమణకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. ప్రభుత్వం నుంచి బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆనందీ తీర్పు వెలువరించారు.
News September 20, 2024
మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: ఎండీ
విశాఖ జిల్లాలో మంజూరైన ప్రతి ఇంటిని అధికారులు దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గృహ నిర్మాణాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు కాంట్రాక్టర్లకు అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసి మయూర్ అశోక్ పాల్గొన్నారు.