News June 7, 2024

AU: జూలై 31 నుంచి బీఈడీ నాలుగో సెమిస్టర్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలను జూలై 31 నుంచి ఆగస్టు 3వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టార్ (పరీక్షలు) జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 31న కాంటెంపరరీ ఇండియన్ ఎడ్యుకేషన్, ఒకటో తేదీన జెండర్ స్కూల్ అండ్ సొసైటీ, 2వ తేదీన ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి.

Similar News

News January 13, 2025

రేపు విశాఖ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రేపు విశాఖ నుంచి చర్లపల్లికి (08523/24)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. రేపు సాయంత్రం విశాఖలో 6:20కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, భీమవరం, గుడివాడ మీదుగా మరుసటి రోజు తెల్లవారి 7:30కి చర్లపల్లి చేరుతుంది. 2nd AC,3rd Ac, స్లీపర్, జనరల్ క్లాస్ ఉంటాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News January 13, 2025

నర్నీపట్నం: కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

image

నర్సీపట్నం వేములపూడి కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల ప్రిన్సిపల్ శాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు సర్వ శిక్షా అభియాన్ ఏపీడి జయప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన సమయంలో సమాచారాన్ని ఒక రోజు ఆలస్యంగా అధికారులకు చెప్పడాన్ని తప్పుపడుతూ సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంలో మరో ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

News January 13, 2025

అనకాపల్లి: బాలిక పై అత్యాచారం

image

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో ఐదేళ్ల బాలిక పై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శనివారం జరగగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. బాలికను కేజీహెచ్‌కు తరలించారు.