News August 1, 2024

ఆగస్టు 1: చరిత్రలో ఈరోజు

image

✒ 1882: సమరయోధుడు పురుషోత్తమ దాస్ టాండన్ జననం
✒ 1900: సాహితీకారుడు కాశీవిశ్వనాథ శాస్త్రి జననం
✒ 1920: సమరయోధుడు బాలగంగాధర తిలక్ మరణం
✒ 1921: ఆధునిక కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ జననం
✒ 1936: పండితులు వావిలికొలను సుబ్బారావు మరణం
✒ 1955: మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ జననం
✒ 1983: దర్శకుడు కేఎస్ రవీంద్ర జననం

Similar News

News December 9, 2025

ఘోరం: భార్య మగ పిల్లాడిని కనలేదని..

image

టెక్నాలజీ ఎంత పెరిగినా కొందరిలో మూఢనమ్మకాలు పోవట్లేదు. కర్ణాటక విజయపుర(D)లో భార్య ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని ఆమెకు శిరోముండనం చేసి వెంట్రుకలను శ్మశానంలో కాల్చేశాడో భర్త. బ్లేడుతో కట్ చేయడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. భార్యలో దెయ్యం ఉందని, అందుకే మగ పిల్లాడు పుట్టలేదని ఓ మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి భర్త డుండేశ్‌ను అరెస్టు చేశారు.

News December 9, 2025

బెస్ట్ రైస్ డిష్‌లో హైదరాబాద్ బిర్యానీ సత్తా

image

ప్రపంచ ప్రఖ్యాత ఆహార రేటింగ్ సంస్థ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన 2026 ‘బెస్ట్ ఫుడ్’ జాబితాలో హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. టాప్ 100 డిషెస్ జాబితాలో 72వ స్థానంలో నిలిచిన హైదరాబాదీ బిర్యానీ, ప్రపంచంలోని టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్‌లో 10వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సువాసనభరితమైన బాస్మతి రైస్, మసాలాలు హైదరాబాదీ బిర్యానీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

News December 9, 2025

‘స్టార్‌లింక్’ ధరలు ప్రకటించలేదు.. క్లారిటీ ఇచ్చిన సంస్థ

image

భారత్‌లో ‘స్టార్‌లింక్’ సేవల ధరలు ఇప్పటివరకు ప్రకటించలేదని సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్‌లో నెలకు రూ.8,600 ఛార్జీలు, హార్డ్‌వేర్ కిట్ రూ.34,000గా <<18504876>>చూపడాన్ని<<>> ‘కాన్ఫిగరేషన్ గ్లిచ్’గా కంపెనీ పేర్కొంది. అవి కేవలం డమ్మీ డేటా మాత్రమేనని, అసలు ధరలు ఇంకా ఫిక్స్‌ చేయలేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాకే సేవలు ప్రారంభమవుతాయని క్లారిటీ ఇచ్చారు.