News August 15, 2024
ఆగస్టు 15: చరిత్రలో ఈ రోజు

1769: ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ జననం
1945: నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహరావు జననం
1947: భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం
1961: సినీ నటి సుహాసిని జననం
1964: సినీ నటుడు శ్రీహరి జననం
1971: బహ్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం
1975: భారత మాజీ క్రికెటర్ విజయ్ భరద్వాజ్ జననం
2018: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ మరణం
Similar News
News December 4, 2025
ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 4, 2025
ప్రభుత్వ స్కూళ్లలో ‘క్లిక్కర్’ విధానం

AP: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పాఠాల రివిజన్కు ప్రభుత్వం ‘క్లిక్కర్’ విధానాన్ని తీసుకురానుంది. లెసన్ పూర్తయిన తర్వాత స్టూడెంట్లకు క్లిక్కర్ ఇస్తారు. అందులో A, B, C, D, యెస్, నో, హ్యాండ్ రైజ్ ఆప్షన్లు ఉంటాయి. క్లాస్ రూమ్లోని డిజిటల్ బోర్డులో ప్రశ్న డిస్ప్లే అవుతుంది. దానికి క్లిక్కర్ ద్వారా ఆన్సర్ ఇవ్వాలి. ఈ విధానాన్ని రేపు తొలిదశలో 53 స్కూళ్లలో CM చంద్రబాబు ప్రారంభించనున్నారు.
News December 4, 2025
విచారణ ఇంత జాప్యమా… వ్యవస్థకే సిగ్గుచేటు: SC

యాసిడ్ దాడి కేసుల విచారణ డేటాను సమర్పించాలని అన్ని హైకోర్టులను SC ఆదేశించింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్ల నాటి ఓ కేసు విచారణ ఇప్పటికీ పూర్తికాకపోవడంపై CJI సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఇది వ్యవస్థకే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 2009లో యాసిడ్ దాడిలో గాయపడిన ఓ యువతి తన ఆవేదనను SCకి వినిపించారు. ముఖంపై యాసిడ్ దాడితో వైకల్యంతో పాటు దాన్ని తాగించిన ఘటనల్లో పలువురు ఆహారాన్నీ తీసుకోలేకపోతున్నారన్నారు.


