News August 16, 2025
ఆగస్టు 16: చరిత్రలో ఈ రోజు

1919 : మాజీ సీఎం టంగుటూరి అంజయ్య జననం
1920 : మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి(ఫొటోలో) జననం
1970: మనీషా కొయిరాలా జననం
1989 : సింగర్ శ్రావణ భార్గవి జననం
1996 : వేద పండితులు, గాంధేయవాది చర్ల గణపతిశాస్త్రి మరణం
2001 : భారత భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి మరణం
Similar News
News August 16, 2025
సృష్టి ఫెర్టిలిటీ కేసు.. నేరం అంగీకరించిన డా.నమ్రత

TG: సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితురాలు డా.నమ్రత నేరం అంగీకరించినట్లు కన్ఫెషన్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ‘IVF, సరోగసీ ట్రీట్మెంట్ చేయకుండానే చాలామంది వద్ద రూ.30లక్షల చొప్పున వసూలు చేశాం. అబార్షన్‌కు వచ్చేవారికి డబ్బు ఆశ చూపి డెలివరీ తర్వాత శిశువులను కొనేవాళ్లం. పిల్లల కొనుగోలులో ఏజెంట్లు సంజయ్, సంతోషి కీలకంగా వ్యవహరించారు. నా కుమారుడు లీగల్‌గా సహకరించేవాడు’ అని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు.
News August 16, 2025
AIతోనే స్క్రిప్ట్, డబ్బింగ్, డీఏజింగ్ చేసేశారు!

సినీ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయింది. సైయారా, కూలీ, వార్-2 సినిమాల్లో AI కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సైయారా క్లైమాక్స్ స్క్రిప్ట్‌ను AI జనరేట్ చేయగా, వార్-2 డబ్బింగ్ & కూలీలో రజినీకాంత్ డీఏజింగ్‌ను ఏఐ ద్వారా చేశారని టాక్. బెంగళూరులోని ఓ AI స్టార్టప్ విజువల్ డబ్ అనే టూల్‌ను వాడి ‘వార్-2’ను తెలుగులోకి డబ్ చేశారట. ఇది ఆడియోకు సరిపోయేలా నటుల లిప్ సింక్‌ను మారుస్తుంది.
News August 16, 2025
జగన్ జెండా ఆవిష్కరించకపోవడం విచారకరం: ధూళిపాళ్ల

AP: నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా YS జగన్ జాతీయ జెండా ఆవిష్కరణకు బయటకు రాకపోవడం శోచనీయమని TDP MLA ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ‘ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగురవేయని మాజీ CMగా, పార్టీ చీఫ్‌గా నిలిచారు. ఇలా చేయడం దేశాన్ని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని, జెండాను అవమానించడమే. పులివెందుల ఓటమి ఫ్రస్ట్రేషన్ దీనికి కారణం కావొచ్చు. జగన్ జెండా ఆవిష్కరించకపోవడం విచారకరం’ అని Xలో మండిపడ్డారు.